Bible

John 19 - YLT (Telugu)

1 Then, therefore, did Pilate take Jesus and scourge `him',అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.

2 and the soldiers having plaited a crown of thorns, did place `it' on his head, and a purple garment they put around him,సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి

3 and said, `Hail! the king of the Jews;' and they were giving him slaps.ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చియూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.

4 Pilate, therefore, again went forth without, and saith to them, `Lo, I do bring him to you without, that ye may know that in him I find no fault;'పిలాతు మరల వెలుపలికి వచ్చిఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.

5 Jesus, therefore, came forth without, bearing the thorny crown and the purple garment; and he saith to them, `Lo, the man!'ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతుఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను.

6 When, therefore, the chief priests and the officers did see him, they cried out, saying, `Crucify, crucify;' Pilate saith to them, `Take ye him -- ye, and crucify; for I find no fault in him;'ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచిసిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతుఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.

7 the Jews answered him, `We have a law, and according to our law he ought to die, for he made himself Son of God.'అందుకు యూదులుమాకొక నియ మము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.

8 When, therefore, Pilate heard this word, he was the more afraid,పిలాతు ఆ మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి

9 and entered again to the praetorium, and saith to Jesus, `Whence art thou?' and Jesus gave him no answer.నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు

10 Pilate, therefore, saith to him, `To me dost thou not speak? hast thou not known that I have authority to crucify thee, and I have authority to release thee?'గనుక పిలాతునాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.

11 Jesus answered, `Thou wouldst have no authority against me, if it were not having been given thee from above; because of this, he who is delivering me up to thee hath greater sin.'అందుకు యేసుపైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను.

12 From this `time' was Pilate seeking to release him, and the Jews were crying out, saying, `If this one thou mayest release, thou art not a friend of Caesar; every one making himself a king, doth speak against Caesar.'ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.

13 Pilate, therefore, having heard this word, brought Jesus without -- and he sat down upon the tribunal -- to a place called, `Pavement,' and in Hebrew, Gabbatha;పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి,రాళ్లు పర చిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు.

14 and it was the preparation of the passover, and as it were the sixth hour, and he saith to the Jews, `Lo, your king!'ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడుఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా

15 and they cried out, `Take away, take away, crucify him;' Pilate saith to them, `Your king shall I crucify?' the chief priests answered, `We have no king except Caesar.'అందుకు వారు ఇతనిని సంహ రించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతుమీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులుకైసరు తప్ప మా

16 Then, therefore, he delivered him up to them, that he may be crucified, and they took Jesus and led `him' away,అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

17 and bearing his cross, he went forth to the place called `Place' of a Skull, which is called in Hebrew Golgotha;వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.

18 where they crucified him, and with him two others, on this side, and on that side, and Jesus in the midst.అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.

19 And Pilate also wrote a title, and put `it' on the cross, and it was written, `Jesus the Nazarene, the king of the Jews;'మరియు పిలాతుయూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.

20 this title, therefore, read many of the Jews, because the place was nigh to the city where Jesus was crucified, and it was having been written in Hebrew, in Greek, in Roman.యేసు సిలువవేయ బడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.

21 The chief priests of the Jews said, therefore, to Pilate, `Write not -- The king of the Jews, but that one said, I am king of the Jews;'నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గానియూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా

22 Pilate answered, `What I have written, I have written.'పిలాతునేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.

23 The soldiers, therefore, when they did crucify Jesus, took his garments, and made four parts, to each soldier a part, also the coat, and the coat was seamless, from the top woven throughout,సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్ర ములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక

24 they said, therefore, to one another, `We may not rend it, but cast a lot for it, whose it shall be;' that the Writing might be fulfilled, that is saying, `They divided my garments to themselves, and upon my raiment they did cast a lot;' the soldiers, therefore, indeed, did these things.వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను;ఇందుకే సైని కులు ఈలాగు చేసిరి.

25 And there stood by the cross of Jesus his mother, and his mother's sister, Mary of Cleopas, and Mary the Magdalene;ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.

26 Jesus, therefore, having seen `his' mother, and the disciple standing by, whom he was loving, he saith to his mother, `Woman, lo, thy son;'యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,

27 afterward he saith to the disciple, `Lo, thy mother;' and from that hour the disciple took her to his own `home'.తరువాత శిష్యుని చూచి యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.

28 After this, Jesus knowing that all things now have been finished, that the Writing may be fulfilled, saith, `I thirst;'అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను.

29 a vessel, therefore, was placed full of vinegar, and they having filled a sponge with vinegar, and having put `it' around a hyssop stalk, did put `it' to his mouth;చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.

30 when, therefore, Jesus received the vinegar, he said, `It hath been finished;' and having bowed the head, gave up the spirit.యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.

31 The Jews, therefore, that the bodies might not remain on the cross on the sabbath, since it was the preparation, (for that sabbath day was a great one,) asked of Pilate that their legs may be broken, and they taken away.ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.

32 The soldiers, therefore, came, and of the first indeed they did break the legs, and of the other who was crucified with him,కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.

33 and having come to Jesus, when they saw him already having been dead, they did not break his legs;వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని

34 but one of the soldiers with a spear did pierce his side, and immediately there came forth blood and water;సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

35 and he who hath seen hath testified, and his testimony is true, and that one hath known that true things he speaketh, that ye also may believe.ఇది చూచిన వాడు సాక్ష్య మిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును.

36 For these things came to pass, that the Writing may be fulfilled, `A bone of him shall not be broken;'అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.

37 and again another Writing saith, `They shall look to him whom they did pierce.'మరియు తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.

38 And after these things did Joseph of Arimathea -- being a disciple of Jesus, but concealed, through the fear of the Jews -- ask of Pilate, that he may take away the body of Jesus, and Pilate gave leave; he came, therefore, and took away the body of Jesus,అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గ

39 and Nicodemus also came -- who came unto Jesus by night at the first -- bearing a mixture of myrrh and aloes, as it were, a hundred pounds.మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.

40 They took, therefore, the body of Jesus, and bound it with linen clothes with the spices, according as it was the custom of the Jews to prepare for burial;అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.

41 and there was in the place where he was crucified a garden, and in the garden a new tomb, in which no one was yet laid;ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.

42 there, therefore, because of the preparation of the Jews, because the tomb was nigh, they laid Jesus.ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.

Telugu Bible