John 10 - DBY (Telugu)
1 Verily, verily, I say to you, He that enters not in by the door to the fold of the sheep, but mounts up elsewhere, *he* is a thief and a robber;గొఱ్ఱల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.
2 but he that enters in by the door is [the] shepherd of the sheep.ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి.
3 To him the porter opens; and the sheep hear his voice; and he calls his own sheep by name, and leads them out.అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.
4 When he has put forth all his own, he goes before them, and the sheep follow him, because they know his voice.మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును.
5 But they will not follow a stranger, but will flee from him, because they know not the voice of strangers.అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
6 This allegory spoke Jesus to them, but they did not know what it was [of] which he spoke to them.ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.
7 Jesus therefore said again to them, Verily, verily, I say to you, I am the door of the sheep.కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
8 All whoever came before me are thieves and robbers; but the sheep did not hear them.గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱలు వారి స్వరము వినలేదు.
9 I am the door: if any one enter in by me, he shall be saved, and shall go in and shall go out and shall find pasture.నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
10 The thief comes not but that he may steal, and kill, and destroy: I am come that they might have life, and might have [it] abundantly.దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
11 I am the good shepherd. The good shepherd lays down his life for the sheep:నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.
12 but he who serves for wages, and who is not the shepherd, whose own the sheep are not, sees the wolf coming, and leaves the sheep and flees; and the wolf seizes them and scatters the sheep.జీతగాడు గొఱ్ఱల కాపరికాడు గనుక గొఱ్ఱలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలను పట్టి చెదరగొట్టును.
13 Now he who serves for wages flees because he serves for wages, and is not himself concerned about the sheep.జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.
14 I am the good shepherd; and I know those that are mine, and am known of those that are mine,నేను గొఱ్ఱల మంచి కాపరిని.
15 as the Father knows me and I know the Father; and I lay down my life for the sheep.తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
16 And I have other sheep which are not of this fold: those also I must bring, and they shall hear my voice; and there shall be one flock, one shepherd.ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.
17 On this account the Father loves me, because I lay down my life that I may take it again.నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.
18 No one takes it from me, but I lay it down of myself. I have authority to lay it down and I have authority to take it again. I have received this commandment of my Father.ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
19 There was a division again among the Jews on account of these words;ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.
20 but many of them said, He has a demon and raves; why do ye hear him?వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.
21 Others said, These sayings are not [those] of one that is possessed by a demon. Can a demon open blind people's eyes?మరి కొందరుఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.
22 Now the feast of the dedication was celebrating at Jerusalem, and it was winter.ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగు చుండెను.
23 And Jesus walked in the temple in the porch of Solomon.అది శీతకాలము. అప్పుడు యేసు దేవాల యములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా
24 The Jews therefore surrounded him, and said to him, Until when dost thou hold our soul in suspense? If thou art the Christ, say [so] to us openly.యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
25 Jesus answered them, I told you, and ye do not believe. The works which I do in my Father's name, these bear witness concerning me:అందుకు యేసుమీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
26 but ye do not believe, for ye are not of my sheep, as I told you.అయితే మీరు నా గొఱ్ఱలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.
27 My sheep hear my voice, and I know them, and they follow me;నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
28 and I give them life eternal; and they shall never perish, and no one shall seize them out of my hand.నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.
29 My Father who has given [them] to me is greater than all, and no one can seize out of the hand of my Father.వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;
30 I and the Father are one.నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
31 The Jews therefore again took stones that they might stone him.యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా
32 Jesus answered them, Many good works have I shewn you of my Father; for which work of them do ye stone me?యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.
33 The Jews answered him, For a good work we stone thee not, but for blasphemy, and because thou, being a man, makest thyself God.అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో
34 Jesus answered them, Is it not written in your law, I said, Ye are gods?అందుకు యేసుమీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
35 If he called *them* gods to whom the word of God came (and the scripture cannot be broken),లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
36 do ye say of him whom the Father has sanctified and sent into the world, Thou blasphemest, because I said, I am Son of God?తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితోనీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
37 If I do not the works of my Father, believe me not;నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,
38 but if I do, even if ye believe not me, believe the works, that ye may know [and believe] that the Father is in me and I in him.చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.
39 They sought therefore again to take him; and he went away from out of their handవారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.
40 and departed again beyond the Jordan to the place where John was baptising at the first: and he abode there.యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.
41 And many came to him, and said, John did no sign; but all things which John said of this [man] were true.అనేకులు ఆయనయొద్దకు వచ్చియోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.
42 And many believed on him there.అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
Telugu Bible