Bible

John 10 - ASV (Telugu)

1 Verily, verily, I say unto you, He that entereth not by the door into the fold of the sheep, but climbeth up some other way, the same is a thief and a robber.గొఱ్ఱల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.

2 But he that entereth in by the door is the shepherd of the sheep.ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి.

3 To him the porter openeth; and the sheep hear his voice: and he calleth his own sheep by name, and leadeth them out.అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.

4 When he hath put forth all his own, he goeth before them, and the sheep follow him: for they know his voice.మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును.

5 And a stranger will they not follow, but will flee from him: for they know not the voice of strangers.అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

6 This parable spake Jesus unto them: but they understood not what things they were which he spake unto them.ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.

7 Jesus therefore said unto them again, Verily, verily, I say unto you, I am the door of the sheep.కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను

8 All that came before me are thieves and robbers: but the sheep did not hear them.గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱలు వారి స్వరము వినలేదు.

9 I am the door; by me if any man enter in, he shall be saved, and shall go in and go out, and shall find pasture.నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.

10 The thief cometh not, but that he may steal, and kill, and destroy: I came that they may have life, and may have `it' abundantly.దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

11 I am the good shepherd: the good shepherd layeth down his life for the sheep.నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.

12 He that is a hireling, and not a shepherd, whose own the sheep are not, beholdeth the wolf coming, and leaveth the sheep, and fleeth, and the wolf snatcheth them, and scattereth `them':జీతగాడు గొఱ్ఱల కాపరికాడు గనుక గొఱ్ఱలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలను పట్టి చెదరగొట్టును.

13 `he fleeth' because he is a hireling, and careth not for the sheep.జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.

14 I am the good shepherd; and I know mine own, and mine own know me,నేను గొఱ్ఱల మంచి కాపరిని.

15 even as the Father knoweth me, and I know the Father; and I lay down my life for the sheep.తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

16 And other sheep I have, which are not of this fold: them also I must bring, and they shall hear my voice: and they shall become one flock, one shepherd.ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.

17 Therefore doth the Father love me, because I lay down my life, that I may take it again.నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.

18 No one taketh it away from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment received I from my Father.ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.

19 There arose a division again among the Jews because of these words.ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.

20 And many of them said, He hath a demon, and is mad; why hear ye him?వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.

21 Others said, These are not the sayings of one possessed with a demon. Can a demon open the eyes of the blind?మరి కొందరుఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.

22 And it was the feast of the dedication at Jerusalem:ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగు చుండెను.

23 it was winter; and Jesus was walking in the temple in Solomon's porch.అది శీతకాలము. అప్పుడు యేసు దేవాల యములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా

24 The Jews therefore came round about him, and said unto him, How long dost thou hold us in suspense? If thou art the Christ, tell us plainly.యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.

25 Jesus answered them, I told you, and ye believe not: the works that I do in my Father's name, these bear witness of me.అందుకు యేసుమీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

26 But ye believe not, because ye are not of my sheep.అయితే మీరు నా గొఱ్ఱలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.

27 My sheep hear my voice, and I know them, and they follow me:నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.

28 and I give unto them eternal life; and they shall never perish, and no one shall snatch them out of my hand.నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.

29 My Father, who hath given `them' unto me, is greater than all; and no one is able to snatch `them' out of the Father's hand.వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;

30 I and the Father are one.నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.

31 The Jews took up stones again to stone him.యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా

32 Jesus answered them, Many good works have I showed you from the Father; for which of those works do ye stone me?యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.

33 The Jews answered him, For a good work we stone thee not, but for blasphemy; and because that thou, being a man, makest thyself God.అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో

34 Jesus answered them, Is it not written in your law, I said, ye are gods?అందుకు యేసుమీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?

35 If he called them gods, unto whom the word of God came (and the scripture cannot be broken),లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,

36 say ye of him, whom the Father sanctified and sent into the world, Thou blasphemest; because I said, I am `the' Son of God?తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితోనీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?

37 If I do not the works of my Father, believe me not.నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,

38 But if I do them, though ye believe not me, believe the works: that ye may know and understand that the Father is in me, and I in the Father.చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.

39 They sought again to take him: and he went forth out of their hand.వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.

40 And he went away again beyond the Jordan into the place where John was at the first baptizing; and there be abode.యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.

41 And many came unto him; and they said, John indeed did no sign: but all things whatsoever John spake of this man were true.అనేకులు ఆయనయొద్దకు వచ్చియోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.

42 And many believed on him there.అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.

Telugu Bible