Bible

Job 4 - WEB (Telugu)

1 Then Eliphaz the Temanite answered,దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను

2 "If someone ventures to talk with you, will you be grieved? But who can withhold himself from speaking?ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?

3 Behold, you have instructed many, You have strengthened the weak hands.అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు.

4 Your words have supported him who was falling, You have made firm the feeble knees.నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను.క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.

5 But now it is come to you, and you faint; It touches you, and you are troubled.అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.

6 Isn't your piety your confidence, The integrity of your ways your hope?నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?

7 "Remember, now, whoever perished, being innocent? Or where were the upright cut off?జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడుఎప్పుడైన నశించెనా?యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?

8 According to what I have seen, those who plow iniquity, And sow trouble, Reap the same.నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు.

9 By the breath of God they perish, By the blast of his anger are they consumed.దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు.

10 The roaring of the lion, and the voice of the fierce lion, The teeth of the young lions, are broken.సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును.కొదమ సింహముల కోరలును విరిగిపోవును.

11 The old lion perishes for lack of prey, The cubs of the lioness are scattered abroad.ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.

12 "Now a thing was secretly brought to me, My ear received a whisper of it.నా కొకమాట రహస్యముగా తెలుపబడెనునా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను.

13 In thoughts from the visions of the night, When deep sleep falls on men,గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

14 Fear came on me, and trembling, Which made all my bones shake.భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను.

15 Then a spirit passed before my face; The hair of my flesh stood up.ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను.

16 It stood still, but I couldn't discern the appearance of it; A form was before my eyes. Silence, then I heard a voice, saying,అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెనుమెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగాదేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?

17 'Shall mortal man be more just than God? Shall a man be more pure than his Maker?తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?

18 Behold, he puts no trust in his servants. He charges his angels with error.ఆయన తన సేవకులను నమ్ముటలేదుతన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.

19 How much more, those who dwell in houses of clay, Whose foundation is in the dust, Who are crushed before the moth!జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?

20 Between morning and evening they are destroyed. They perish forever without any regarding it.ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురుఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.

21 Isn't their tent-cord plucked up within them? They die, and that without wisdom.'వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధికలుగకయే మృతినొందుదురు.ఆలాగుననే జరుగుచున్నది గదా.

Telugu Bible