Bible

Isaiah 64 - WEB (Telugu)

1 Oh that you would tear the heavens, that you would come down, that the mountains might quake at your presence,గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.

2 as when fire kindles the brushwood, [and] the fire causes the waters to boil; to make your name known to your adversaries, that the nations may tremble at your presence!నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక.

3 When you did terrible things which we didn't look for, you came down, the mountains quaked at your presence.జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.

4 For from of old men have not heard, nor perceived by the ear, neither has the eye seen a God besides you, who works for him who waits for him.తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.

5 You meet him who rejoices and works righteousness, those who remember you in your ways: behold, you were angry, and we sinned: in them [have we been] of long time; and shall we be saved?నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతివిు బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?

6 For we are all become as one who is unclean, and all our righteousness are as a polluted garment: and we all do fade as a leaf; and our iniquities, like the wind, take us away.మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను

7 There is none who calls on your name, who stirs up himself to take hold of you; for you have hid your face from us, and have consumed us by means of our iniquities.నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.

8 But now, Yahweh, you are our Father; we are the clay, and you our potter; and we all are the work of your hand.యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

9 Don't be angry very sore, Yahweh, neither remember iniquity forever: see, look, we beg you, we are all your people.యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమంద రము నీ ప్రజలమే గదా.

10 Your holy cities are become a wilderness, Zion is become a wilderness, Jerusalem a desolation.నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.

11 Our holy and our beautiful house, where our fathers praised you, is burned with fire; and all our pleasant places are laid waste.మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.

12 Will you refrain yourself for these things, Yahweh? will you hold your peace, and afflict us very sore?యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?

Telugu Bible