Bible

Isaiah 30 - WEB (Telugu)

1 Woe to the rebellious children, says Yahweh, who take counsel, but not of me; and who make a league, but not of my Spirit, that they may add sin to sin,యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు

2 that set out to go down into Egypt, and have not asked at my mouth; to strengthen themselves in the strength of Pharaoh, and to take refuge in the shadow of Egypt!వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు.

3 Therefore shall the strength of Pharaoh be your shame, and the refuge in the shadow of Egypt your confusion.ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.

4 For their princes are at Zoan, and their ambassadors are come to Hanes.యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు

5 They shall all be ashamed because of a people that can't profit them, that are not a help nor profit, but a shame, and also a reproach.వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు.

6 The burden of the animals of the South. Through the land of trouble and anguish, from whence come the lioness and the lion, the viper and fiery flying serpent, they carry their riches on the shoulders of young donkeys, and their treasures on the humps of camels, to a people that shall not profit [them].దక్షిణ దేశములోనున్న క్రూరమృగములను గూర్చిన దేవోక్తి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలుగల దేశముగుండ వారు గాడిదపిల్లల వీపులమీద తమ ఆస్తిని ఒంటెల మూపులమీద తమ ద్రవ్యములను ఎక్కించు కొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసికొని పోవుదురు.

7 For Egypt helps in vain, and to no purpose: therefore have I called her Rahab who sits still.ఐగుప్తువలని సహాయము పనికిమాలినది,నిష్ప్రయోజన మైనది అందుచేతనుఏమియు చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను.

8 Now go, write it before them on a tablet, and inscribe it in a book, that it may be for the time to come forever and ever.రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథ ములో లిఖింపుము

9 For it is a rebellious people, lying children, children who will not hear the law of Yahweh;వారు తిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు

10 who tell the seers, "Don't see;" and to the prophets, "Don't prophesy to us right things, speak to us smooth things, prophesy deceits,దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పు వారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయాదర్శనములను కనుడి

11 get out of the way, turn aside out of the path, cause the Holy One of Israel to cease from before us."అడ్డము రాకుండుడి త్రోవనుండి తొలగుడి ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని సంగతి మా యెదుట ఎత్తకుడి అని భవిష్యద్‌ జ్ఞానులతో పలుకువారునై యున్నారు.

12 Therefore thus says the Holy One of Israel, "Because you despise this word, and trust in oppression and perverseness, and rely thereon;అందుచేతను ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యమువద్దని త్రోసివేసి బలాత్కార మును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసికొంటిరి గనుక

13 therefore this iniquity shall be to you as a breach ready to fall, swelling out in a high wall, whose breaking comes suddenly in an instant.ఈ దోషము మీకు ఎత్తయిన గోడ నుండి జోగిపడబోవుచున్న గోడ అండవలె అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.

14 He shall break it as a potter's vessel is broken, breaking it in pieces without sparing; so that there shall not be found among the pieces of it a broken piece with which to take fire from the hearth, or to dip up water out of the cistern."కుమ్మరి కుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు.

15 For thus said the Lord Yahweh, the Holy One of Israel, In returning and rest shall you be saved; in quietness and in confidence shall be your strength. You would not:ప్రభువును ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుటవలన రక్షింప బడెదరు మీరు ఊరకుండి నమ్ముకొనుటవలన మీకు బలము కలుగును.

16 but you said, No, for we will flee on horses; therefore shall you flee: and, We will ride on the swift; therefore shall those who pursue you be swift.అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.

17 One thousand [shall flee] at the threat of one; at the threat of five shall you flee: until you be left as a beacon on the top of a mountain, and as an ensign on a hill.మీరు పర్వతముమీదనుండు కొయ్యవలెను కొండమీదనుండు జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యిమంది పారిపోయెదరు అయిదుగురి గద్దింపునకు మీరు పారిపోయెదరు.

18 Therefore will Yahweh wait, that he may be gracious to you; and therefore will he be exalted, that he may have mercy on you: for Yahweh is a God of justice; blessed are all those who wait for him.కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.

19 For the people shall dwell in Zion at Jerusalem; you shall weep no more; he will surely be gracious to you at the voice of your cry; when he shall hear, he will answer you.సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరు ణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును.

20 Though the Lord give you the bread of adversity and the water of affliction, yet shall not your teachers be hidden anymore, but your eyes shall see your teachers;ప్రభువు నీకు క్లేషాన్నపానముల నిచ్చును ఇకమీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులార నీ బోధకులను చూచెదవు

21 and your ears shall hear a word behind you, saying, This is the way, walk you in it; when you turn to the right hand, and when you turn to the left.మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.

22 You shall defile the overlaying of your engraved images of silver, and the plating of your molten images of gold: you shall cast them away as an unclean thing; you shall tell it, Get you hence.చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు.

23 He will give the rain for your seed, with which you shall sow the ground; and bread of the increase of the ground, and it shall be fat and plenteous. In that day shall your cattle feed in large pastures;నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును.

24 the oxen likewise and the young donkeys that till the ground shall eat savory provender, which has been winnowed with the shovel and with the fork.భూమి సేద్యముచేయు ఎడ్లును లేత గాడిదలును చేట తోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును.

25 There shall be on every lofty mountain, and on every high hill, brooks [and] streams of waters, in the day of the great slaughter, when the towers fall.గోపురములు పడు మహా హత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతముమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను వాగులును నదులును పారును.

26 Moreover the light of the moon shall be as the light of the sun, and the light of the sun shall be sevenfold, as the light of seven days, in the day that Yahweh binds up the hurt of his people, and heals the stroke of their wound.యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

27 Behold, the name of Yahweh comes from far, burning with his anger, and in thick rising smoke: his lips are full of indignation, and his tongue is as a devouring fire;ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

28 and his breath is as an overflowing stream, that reaches even to the neck, to sift the nations with the sieve of destruction: and a bridle that causes to err [shall be] in the jaws of the peoples.ఆయన ఊపిరి కుతికలలోతు వచ్చు ప్రవాహమైన నదివలె ఉన్నది వ్యర్థమైనవాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనము లను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును.

29 You shall have a song as in the night when a holy feast is kept; and gladness of heart, as when one goes with a pipe to come to the mountain of Yahweh, to the Rock of Israel.రాత్రియందు పండుగ నాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవాయొక్క పర్వతమునకు పిల్లనగ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయసంతోషము కలుగును.

30 Yahweh will cause his glorious voice to be heard, and will show the lighting down of his arm, with the indignation of [his] anger, and the flame of a devouring fire, with a blast, and tempest, and hailstones.యెహోవా తన ప్రభావముగల స్వరమును విని పించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.

31 For through the voice of Yahweh shall the Assyrian be dismayed; with his rod will he strike [him].యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును.

32 Every stroke of the appointed staff, which Yahweh shall lay on him, shall be with [the sound of] tambourines and harps; and in battles with the brandishing [of his arm] will he fight with them.యెహోవా అష్షూరుమీద పడవేయు నియామక దండమువలని ప్రతి దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వానిమీద ఆడించుచు యుద్ధము చేయును.

33 For a Topheth is prepared of old; yes, for the king it is made ready; he has made it deep and large; the pile of it is fire and much wood; the breath of Yahweh, like a stream of sulfur, does kindle it.పూర్వమునుండి తోపెతు1 సిద్ధపరచబడియున్నది అది మొలెకుదేవతకు సిద్ధపరచబడియున్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి యున్నాడు అది అగ్నియు విస్తారకాష్ఠములును కలిగియున్నది గంధక ప్రవాహమువలె యెహోవా ఊపిరి దాని రగులబెట్టును.

Telugu Bible