Bible

Isaiah 23 - WEB (Telugu)

1 The burden of Tyre. Howl, you ships of Tarshish; for it is laid waste, so that there is no house, no entering in: from the land of Kittim it is revealed to them.తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.

2 Be still, you inhabitants of the coast, you whom the merchants of Sidon, that pass over the sea, have replenished.సముద్రతీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సర కులతో నిన్ను నింపిరి.

3 On great waters the seed of the Shihor, the harvest of the Nile, was her revenue; and she was the market of nations.షీహోరు నది ధాన్యము నైలునది పంట సముద్రముమీద నీలోనికి తేబడుచుండెను తూరువలన జనములకు లాభము వచ్చెను.

4 Be ashamed, Sidon; for the sea has spoken, the stronghold of the sea, saying, I have not travailed, nor brought forth, neither have I nourished young men, nor brought up virgins.సీదోనూ, సిగ్గుపడుము, సముద్రము సముద్రదుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదనపడనిదానను పిల్లలు కననిదానను ¸°వనస్థులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను.

5 When the report comes to Egypt, they shall be sorely pained at the report of Tyre.ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.

6 Pass over to Tarshish; wail, you inhabitants of the coast.తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి.

7 Is this your joyous [city], whose antiquity is of ancient days, whose feet carried her afar off to sojourn?నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన దిదేనా?

8 Who has purposed this against Tyre, the giver of crowns, whose merchants are princes, whose traffickers are the honorable of the earth?దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ నెవడు ఉద్దేశించెను?

9 Yahweh of hosts has purposed it, to stain the pride of all glory, to bring into contempt all the honorable of the earth.సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట కును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను.

10 Pass through your land as the Nile, daughter of Tarshish; there is no restraint any more.తర్షీషుకుమారీ, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను నైలునది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము.

11 He has stretched out his hand over the sea, he has shaken the kingdoms: Yahweh has given commandment concerning Canaan, to destroy the strongholds of it.ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనానుకోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను.

12 He said, You shall no more rejoice, you oppressed virgin daughter of Sidon: arise, pass over to Kittim; even there shall you have no rest.మరియు ఆయన సీదోను కన్యకా, చెరపబడినదానా, నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు

13 Behold, the land of the Chaldeans: this people was not; the Assyrian founded it for those who dwell in the wilderness; they set up their towers; they overthrew the palaces of it; they made it a ruin.ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జన ముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి యున్నారు.

14 Howl, you ships of Tarshish; for your stronghold is laid waste.తర్షీషు ఓడలారా, అంగలార్చుడి, మీ దుర్గము పాడై పోయెను.

15 It shall come to pass in that day, that Tyre shall be forgotten seventy years, according to the days of one king: after the end of seventy years it shall be to Tyre as in the song of the prostitute.ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును, ఏమనగా

16 Take a harp, go about the city, you prostitute that has been forgotten; make sweet melody, sing many songs, that you may be remembered.మరవబడిన వేశ్యా, సితారాతీసికొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయిం చుము అనేక కీర్తనలు పాడుము.

17 It shall happen after the end of seventy years, that Yahweh will visit Tyre, and she shall return to her hire, and shall play the prostitute with all the kingdoms of the world on the surface of the earth.డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అది వేశ్యజీతమునకు మరల భూమిమీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.

18 Her merchandise and her hire shall be holiness to Yahweh: it shall not be treasured nor laid up; for her merchandise shall be for those who dwell before Yahweh, to eat sufficiently, and for durable clothing.వేశ్యజీతముగా ఉన్నదాని వర్తకలాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు యెహోవా సన్నిధిని నివసించువారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును.

Telugu Bible