Isaiah 2 - WEB (Telugu)
1 This is what Isaiah the son of Amoz saw concerning Judah and Jerusalem.యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి
2 It shall happen in the latter days, that the mountain of Yahweh's house shall be established on the top of the mountains, And shall be raised above the hills; And all nations shall flow to it.అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు
3 Many peoples shall go and say, "Come, let's go up to the mountain of Yahweh, To the house of the God of Jacob; And he will teach us of his ways, And we will walk in his paths. For out of Zion the law shall go forth, And the word of Yahweh from Jerusalem.ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
4 He will judge between the nations, And will decide concerning many peoples; And they shall beat their swords into plowshares, And their spears into pruning-hooks. Nation shall not lift up sword against nation, Neither shall they learn war any more.ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
5 House of Jacob, come, and let us walk in the light of Yahweh.యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.
6 For you have forsaken your people, the house of Jacob, Because they are filled from the east, With those who practice divination like the Philistines, And they clasp hands with the children of foreigners.యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిష్తీయులవలెమంత్ర ప్రయోగము చేయుదురు అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి యున్నావు.
7 Their land is full of silver and gold, Neither is there any end of their treasures. Their land also is full of horses, Neither is there any end of their chariots.వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథ ములకు మితిలేదు.
8 Their land also is full of idols. They worship the work of their own hands, That which their own fingers have made.వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతిపనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు
9 Man is brought low, And mankind is humbled; Therefore don't forgive them.అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడు దురు కాబట్టి వారిని క్షమింపకుము.
10 Enter into the rock, And hide in the dust, From before the terror of Yahweh, And from the glory of his majesty.యెహోవా భీకరసన్నిధినుండియు ఆయన ప్రభావ మహాత్మ్యమునుండియు బండ బీటలోనికి దూరుము మంటిలో దాగి యుండుము.
11 The lofty looks of man will be brought low, The haughtiness of men will be bowed down, And Yahweh alone will be exalted in that day.నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.
12 For there will be a day of Yahweh of Hosts for all that is proud and haughty, And for all that is lifted up; And it shall be brought low:అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.
13 For all the cedars of Lebanon, that are high and lifted up, For all the oaks of Bashan,ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని బాషాను సిందూర వృక్షములకన్నిటికిని
14 For all the high mountains, For all the hills that are lifted up,ఉన్నతపర్వతములకన్నిటికిని ఎత్తయిన మెట్లకన్నిటికిని
15 For every lofty tower, For every fortified wall,ఉన్నతమైన ప్రతిగోపురమునకును బురుజులుగల ప్రతి కోటకును
16 For all the ships of Tarshish, And for all pleasant imagery.తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.
17 The loftiness of man shall be bowed down, And the haughtiness of men shall be brought low; And Yahweh alone shall be exalted in that day.అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.
18 The idols shall utterly pass away.విగ్రహములు బొత్తిగా నశించిపోవును.
19 Men shall go into the caves of the rocks, And into the holes of the earth, From before the terror of Yahweh, And from the glory of his majesty, When he arises to shake the earth mightily.యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.
20 In that day, men shall cast away their idols of silver, And their idols of gold, Which have been made for themselves to worship, To the moles and to the bats;ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను
21 To go into the caverns of the rocks, And into the clefts of the ragged rocks, From before the terror of Yahweh, And from the glory of his majesty, When he arises to shake the earth mightily.దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.
22 Stop trusting in man, whose breath is in his nostrils; For of what account is he?తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?
Telugu Bible