1యేసు ఈ మాటలుచెప్పి చాలించిన తరువాత... గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంత ములకు వచ్చెను.And it came to pass, that when Jesus had finished these sayings, he departed from Galilee, and came into the coasts of Judaea beyond Jordan;
2బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను.And great multitudes followed him; and he healed them there.
3పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చిఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగాThe Pharisees also came unto him, tempting him, and saying unto him, Is it lawful for a man to put away his wife for every cause?
4ఆయనసృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను సృజించెననియుAnd he answered and said unto them, Have ye not read, that he which made them at the beginning made them male and female,
5ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?And said, For this cause shall a man leave father and mother, and shall cleave to his wife: and they twain shall be one flesh?
6కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీర ముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.Wherefore they are no more twain, but one flesh. What therefore God hath joined together, let not man put asunder.
7అందుకు వారుఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగాThey say unto him, Why did Moses then command to give a writing of divorcement, and to put her away?
8ఆయనమీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.He saith unto them, Moses because of the hardness of your hearts suffered you to put away your wives: but from the beginning it was not so.
9మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నా డనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పు చున్నానని వారితోననెను.And I say unto you, Whosoever shall put away his wife, except it be for fornication, and shall marry another, committeth adultery: and whoso marrieth her which is put away doth commit adultery.
10ఆయన శిష్యులుభార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి.His disciples say unto him, If the case of the man be so with his wife, it is not good to marry.
11అందు కాయనఅనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.But he said unto them, All men cannot receive this saying, save they to whom it is given.
12తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంస కులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసి కొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.For there are some eunuchs, which were so born from their mother's womb: and there are some eunuchs, which were made eunuchs of men: and there be eunuchs, which have made themselves eunuchs for the kingdom of heaven's sake. He that is able to receive it, let him receive it.
13అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయ వలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.Then were there brought unto him little children, that he should put his hands on them, and pray: and the disciples rebuked them.
14ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దిం పగా యేసుచిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పిBut Jesus said, Suffer little children, and forbid them not, to come unto me: for of such is the kingdom of heaven.
15వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.And he laid his hands on them, and departed thence.
16ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయ వలెనని ఆయనను అడిగెను.And, behold, one came and said unto him, Good Master, what good thing shall I do, that I may have eternal life?
17అందుకాయనమంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగAnd he said unto him, Why callest thou me good? there is none good but one, that is, God: but if thou wilt enter into life, keep the commandments.
18యేసునరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము,He saith unto him, Which? Jesus said, Thou shalt do no murder, Thou shalt not commit adultery, Thou shalt not steal, Thou shalt not bear false witness,
19నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను.Honour thy father and thy mother: and, Thou shalt love thy neighbour as thyself.
20అందుకు ఆ ¸°వనుడు ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను.The young man saith unto him, All these things have I kept from my youth up: what lack I yet?
21అందుకు యేసునీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమి్మ బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితోJesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven: and come and follow me.
22అయితే ఆ ¸°వనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను.But when the young man heard that saying, he went away sorrowful: for he had great possessions.
23యేసు తన శిష్యులను చూచిధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను.Then said Jesus unto his disciples, Verily I say unto you, That a rich man shall hardly enter into the kingdom of heaven.
24ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను.And again I say unto you, It is easier for a camel to go through the eye of a needle, than for a rich man to enter into the kingdom of God.
25శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడిఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగాWhen his disciples heard it, they were exceedingly amazed, saying, Who then can be saved?
26యేసు వారిని చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.But Jesus beheld them, and said unto them, With men this is impossible; but with God all things are possible.
27పేతురుఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగాThen answered Peter and said unto him, Behold, we have forsaken all, and followed thee; what shall we have therefore?
28యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు1 మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.And Jesus said unto them, Verily I say unto you, That ye which have followed me, in the regeneration when the Son of man shall sit in the throne of his glory, ye also shall sit upon twelve thrones, judging the twelve tribes of Israel.
29నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.And every one that hath forsaken houses, or brethren, or sisters, or father, or mother, or wife, or children, or lands, for my name's sake, shall receive an hundredfold, and shall inherit everlasting life.
30మొదటివారు అనే కులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగు దురు.But many that are first shall be last; and the last shall be first.