Genesis 9 - YLT (Telugu)
1 And God blesseth Noah, and his sons, and saith to them, `Be fruitful, and multiply, and fill the earth;మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించిమీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
2 and your fear and your dread is on every beast of the earth, and on every fowl of the heavens, on all that creepeth on the ground, and on all fishes of the sea -- into your hand they have been given.మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.
3 Every creeping thing that is alive, to you it is for food; as the green herb I have given to you the whole;ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.
4 only flesh in its life -- its blood -- ye do not eat.అయినను మాంస మును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.
5 `And only your blood for your lives do I require; from the hand of every living thing I require it, and from the hand of man, from the hand of every man's brother I require the life of man;మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.
6 whoso sheddeth man's blood, by man is his blood shed: for in the image of God hath He made man.నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
7 And ye, be fruitful and multiply, teem in the earth, and multiply in it.'మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
8 And God speaketh unto Noah, and unto his sons with him, saying,మరియు దేవుడు నోవహు అతని కుమారులతో
9 `And I, lo, I am establishing My covenant with you, and with your seed after you,ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను,
10 and with every living creature which `is' with you, among fowl, among cattle, and among every beast of the earth with you, from all who are going out of the ark -- to every beast of the earth.పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.
11 And I have established My covenant with you, and all flesh is not any more cut off by waters of a deluge, and there is not any more a deluge to destroy the earth.'నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.
12 And God saith, `This is a token of the covenant which I am giving between Me and you, and every living creature that `is' with you, to generations age-during;మరియు దేవుడునాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే.
13 My bow I have given in the cloud, and it hath been for a token of a covenant between Me and the earth;మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధ నకు గురుతుగా నుండును.
14 and it hath come to pass (in My sending a cloud over the earth) that the bow hath been seen in the cloud,భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.
15 and I have remembered My covenant which is between Me and you, and every living creature among all flesh, and the waters become no more a deluge to destroy all flesh;అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు
16 and the bow hath been in the cloud, and I have seen it -- to remember the covenant age-during between God and every living creature among all flesh which `is' on the earth.'ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.
17 And God saith unto Noah, `This `is' a token of the covenant which I have established between Me and all flesh that `is' upon the earth.'మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
18 And the sons of Noah who are going out of the ark are Shem, and Ham, and Japheth; and Ham is father of Canaan.ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి.
19 These three `are' sons of Noah, and from these hath all the earth been overspread.ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
20 And Noah remaineth a man of the ground, and planteth a vineyard,నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.
21 and drinketh of the wine, and is drunken, and uncovereth himself in the midst of the tent.పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.
22 And Ham, father of Canaan, seeth the nakedness of his father, and declareth to his two brethren without.అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.
23 And Shem taketh -- Japheth also -- the garment, and they place on the shoulder of them both, and go backward, and cover the nakedness of their father; and their faces `are' backward, and their father's nakedness they have not seen.అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట
24 And Noah awaketh from his wine, and knoweth that which his young son hath done to him,అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని
25 and saith: `Cursed `is' Canaan, Servant of servants he is to his brethren.'కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
26 And he saith: `Blessed of Jehovah my God `is' Shem, And Canaan is servant to him.మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
27 God doth give beauty to Japheth, And he dwelleth in tents of Shem, And Canaan is servant to him.'దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
28 And Noah liveth after the deluge three hundred and fifty years;ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.
29 and all the days of Noah are nine hundred and fifty years, and he dieth.నోవహు బ్రదికిన దినములన్నియు తొమి్మదివందల ఏబది యేండ్లు; అప్పు డతడు మృతిబొందెను.
Telugu Bible