Exodus 8 - WEB (Telugu)
1 Yahweh spoke to Moses, Go in to Pharaoh, and tell him, "This is what Yahweh says, 'Let my people go, that they may serve me.తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము;
2 If you refuse to let them go, behold, I will plague all your borders with frogs:నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.
3 and the river shall swarm with frogs, which shall go up and come into your house, and into your bedchamber, and on your bed, and into the house of your servants, and on your people, and into your ovens, and into your kneading-troughs:ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;
4 and the frogs shall come up both on you, and on your people, and on all your servants.'"ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమ నెను.
5 Yahweh said to Moses, "Tell Aaron, 'Stretch forth your hand with your rod over the rivers, over the streams, and over the pools, and cause frogs to come up on the land of Egypt.'"మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు అహరోనును చూచినీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువలమీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా
6 Aaron stretched out his hand over the waters of Egypt; and the frogs came up, and covered the land of Egypt.అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.
7 The magicians did in like manner with their enchantments, and brought up frogs on the land of Egypt.శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.
8 Then Pharaoh called for Moses and Aaron, and said, "Entreat Yahweh, that he take away the frogs from me, and from my people; and I will let the people go, that they may sacrifice to Yahweh."అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించినా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడు కొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగ
9 Moses said to Pharaoh, "I give you the honor of setting the time that I should pray for you, and for your servants, and for your people, that the frogs be destroyed from you and your houses, and remain in the river only."అందుకు మోషేనన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవక
10 He said, "Tomorrow." He said, "Be it according to your word, that you may know that there is none like Yahweh our God.అందుకతడుమా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును;
11 The frogs shall depart from you, and from your houses, and from your servants, and from your people. They shall remain in the river only."అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగి పోవును; అవి యేటిలోనే ఉండుననెను.
12 Moses and Aaron went out from Pharaoh, and Moses cried to Yahweh concerning the frogs which he had brought on Pharaoh.మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా
13 Yahweh did according to the word of Moses, and the frogs died out of the houses, out of the courts, and out of the fields.యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.
14 They gathered them together in heaps, and the land stank.జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.
15 But when Pharaoh saw that there was a respite, he hardened his heart, and didn't listen to them, as Yahweh had spoken.ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.
16 Yahweh said to Moses, "Tell Aaron, 'Stretch out your rod, and strike the dust of the earth, that it may become lice throughout all the land of Egypt.'"అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంత టను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.
17 They did so; and Aaron stretched out his hand with his rod, and struck the dust of the earth, and there were lice on man, and on animal; all the dust of the earth became lice throughout all the land of Egypt.అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలా¸
18 The magicians tried with their enchantments to bring forth lice, but they couldn't. There were lice on man, and on animal.శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మను ష్యులమీదను జంతువులమీదను ఉండగా
19 Then the magicians said to Pharaoh, "This is the finger of God:" and Pharaoh's heart was hardened, and he didn't listen to them; as Yahweh had spoken.శకునగాండ్రుఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.
20 Yahweh said to Moses, "Rise up early in the morning, and stand before Pharaoh; behold, he comes forth to the water; and tell him, 'This is what Yahweh says, "Let my people go, that they may serve me.కాబట్టి యెహోవా మోషేతొ నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచినన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.
21 Else, if you will not let my people go, behold, I will send swarms of flies on you, and on your servants, and on your people, and into your houses: and the houses of the Egyptians shall be full of swarms of flies, and also the ground whereon they are.నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీ యుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
22 I will set apart in that day the land of Goshen, in which my people dwell, that no swarms of flies shall be there; to the end you may know that I am Yahweh in the midst of the earth.మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపు లుండవు.
23 I will put a division between my people and your people: by tomorrow shall this sign be."'"నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.
24 Yahweh did so; and there came grievous swarms of flies into the house of Pharaoh, and into his servants' houses: and in all the land of Egypt the land was corrupted by reason of the swarms of flies.యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.
25 Pharaoh called for Moses and for Aaron, and said, "Go, sacrifice to your God in the land!"అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించిమీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా
26 Moses said, "It isn't appropriate to do so; for we shall sacrifice the abomination of the Egyptians to Yahweh our God. Behold, shall we sacrifice the abomination of the Egyptians before their eyes, and won't they stone us?మోషే అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.
27 We will go three days' journey into the wilderness, and sacrifice to Yahweh our God, as he shall command us."మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను.
28 Pharaoh said, "I will let you go, that you may sacrifice to Yahweh your God in the wilderness, only you shall not go very far away. Pray for me."అందుకు ఫరోమీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను.
29 Moses said, "Behold, I go out from you, and I will pray to Yahweh that the swarms of flies may depart from Pharaoh, from his servants, and from his people, tomorrow; only don't let Pharaoh deal deceitfully any more in not letting the people go to sacrifice to Yahweh."అందుకు మోషేనేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడ
30 Moses went out from Pharaoh, and prayed to Yahweh.ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.
31 Yahweh did according to the word of Moses, and he removed the swarms of flies from Pharaoh, from his servants, and from his people. There remained not one.యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు.
32 Pharaoh hardened his heart this time also, and he didn't let the people go.అయితే ఫరో ఆ సమయమునకూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.
Telugu Bible