Bible

Colossians 4 - WEB (Telugu)

1 Masters, give to your servants that which is just and equal, knowing that you also have a Master in heaven.యజమానులారా, పరలోకములో మీకును యజ మానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మాను సార మైనదియు మీ దాసులయెడల చేయుడి.

2 Continue steadfastly in prayer, watching therein with thanksgiving;ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.

3 praying together for us also, that God may open to us a door for the word, to speak the mystery of Christ, for which I am also in bonds;మరియు నేను బంధక ములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే

4 that I may reveal it as I ought to speak.ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమ యము దేవుడు దయచేయవలెనని3 మాకొరకు ప్రార్థించుడి.

5 Walk in wisdom toward those who are outside, redeeming the time.సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు కొనుడి.

6 Let your speech always be with grace, seasoned with salt, that you may know how you ought to answer each one.ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.

7 All my affairs will be made known to you by Tychicus, the beloved brother, faithful servant, and fellow bondservant in the Lord.ప్రియసహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరి చారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును.

8 I am sending him to you for this very purpose, that he may know your circumstances and comfort your hearts,మీరు మా స్థితి తెలిసికొనునట్లును మీ హృదయములను అతడు ఆదరించు నట్లును,

9 together with Onesimus, the faithful and beloved brother, who is one of you. They will make known to you everything that is going on here.అతనిని అతనితోకూడ నమ్మకమైన ప్రియసహో దరుడైన ఒనేసిమును మీయొద్దకు పంపుచున్నాను; ఇతడు మీ యొద్దనుండి వచ్చినవాడే; వీరిక్కడి సంగతులన్నియు మీకు తెలియజేతురు.

10 Aristarchus, my fellow prisoner greets you, and Mark, the cousin of Barnabas (concerning whom you received commandments, "if he comes to you, receive him"),నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి.

11 and Jesus who is called Justus, who are of the circumcision. These are my only fellow workers for the Kingdom of God, men who have been a comfort to me.మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందినవారిలో చేరిన వారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.

12 Epaphras, who is one of you, a servant of Christ, salutes you, always striving for you in his prayers, that you may stand perfect and complete in all the will of God.మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు; మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పు డును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.

13 For I testify about him, that he has great zeal for you, and for those in Laodicea, and for those in Hierapolis.ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరా పొలివారికొరకును బహు ప్రయాసపడుచున్నాడని యితనినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను.

14 Luke, the beloved physician, and Demas greet you.లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు.

15 Greet the brothers who are in Laodicea, and Nymphas, and the assembly that is in his house.లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.

16 When this letter has been read among you, cause it to be read also in the assembly of the Laodiceans; and that you also read the letter from Laodicea.ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.

17 Tell Archippus, "Take heed to the ministry which you have received in the Lord, that you fulfill it."మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.

18 The salutation of me, Paul, with my own hand: remember my bonds. Grace be with you. Amen.పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.

Telugu Bible