Bible

Amos 2 - DBY (Telugu)

1 Thus saith Jehovah: For three transgressions of Moab, and for four, I will not revoke its sentence; because he burned the bones of the king of Edom into lime.యెహోవా సెలవిచ్చునదేమనగామోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి.

2 And I will send a fire upon Moab, and it shall devour the palaces of Kerijoth; and Moab shall die with tumult, with shouting, [and] with the sound of the trumpet.మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును విన బడుచుండగా మోయాబు చచ్చును.

3 And I will cut off the judge from the midst thereof, and will slay all the princes thereof with him, saith Jehovah.​మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెద నని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

4 Thus saith Jehovah: For three transgressions of Judah, and for four, I will not revoke its sentence; because they have despised the law of Jehovah, and have not kept his statutes; and their lies have caused them to err, after which their fathers walked.యెహోవా సెలవిచ్చునదేమనగాయూదా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమ పితరు లనుసరించిన అబద్ధములను చేపట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి.

5 And I will send a fire upon Judah, and it shall devour the palaces of Jerusalem.యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.

6 Thus saith Jehovah: For three transgressions of Israel, and for four, I will not revoke its sentence; because they have sold the righteous for silver, and the needy for a pair of shoes;యెహోవా సెలవిచ్చునదేమనగాఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమి్మ వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమి్మ వేయుదురు.

7 panting after the dust of the earth on the head of the poor, and turning aside the way of the meek; and a man and his father will go in unto the [same] maid, to profane my holy name.దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;

8 And they lay [themselves] down by every altar upon clothes taken in pledge, and they drink [in] the house of their God the wine of the condemned.తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి పీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.

9 But I destroyed the Amorite before them, whose height was as the height of the cedars, and he was strong as the oaks; but I destroyed his fruit from above, and his roots from beneath.​దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమో రీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,

10 And I brought you up from the land of Egypt, and led you forty years in the wilderness, to possess the land of the Amorite.మరియు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపర చవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.

11 And I raised up of your sons for prophets, and of your young men for Nazarites. Is it not even thus, ye children of Israel? saith Jehovah.మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ ¸°వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయు లారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.

12 And ye gave the Nazarites wine to drink; and commanded the prophets, saying, Prophesy not.అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.

13 Behold, I will press upon you, as a cart presseth that is full of sheaves.ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.

14 And flight shall perish from the swift, and the strong shall not strengthen his force, neither shall the mighty deliver his soul.అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొన జాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొన జాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొన జాలకుండును.

15 Neither shall he stand that handleth the bow; and the swift of foot shall not escape, and he that rideth the horse shall not deliver his soul;విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.

16 and he that is stout-hearted among the mighty shall flee away naked in that day, saith Jehovah.మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యము గలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.

Telugu Bible