Acts 1:6 కాబట్టి వారు కూడివచ్చినప్పుడుప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన
Acts 1:6 in Other Translations
King James Version (KJV) When they therefore were come together, they asked of him, saying, Lord, wilt thou at this time restore again the kingdom to Israel?
American Standard Version (ASV) They therefore, when they were come together, asked him, saying, Lord, dost thou at this time restore the kingdom to Israel?
Bible in Basic English (BBE) So, when they were together, they said to him, Lord, will you at this time give back the kingdom to Israel?
Darby English Bible (DBY) They therefore, being come together, asked him saying, Lord, is it at this time that thou restorest the kingdom to Israel?
World English Bible (WEB) Therefore, when they had come together, they asked him, "Lord, are you now restoring the kingdom to Israel?"
Young's Literal Translation (YLT) They, therefore, indeed, having come together, were questioning him, saying, `Lord, dost thou at this time restore the reign to Israel?'
they
Οἱ
ho
oh
μὲν
men
mane
therefore
οὖν
oun
oon
When were come together,
συνελθόντες
synerchomai
syoon-ARE-hoh-may
they asked
ἐπἠρώτων
eperōtaō
ape-ay-roh-TA-oh
of him,
αὐτὸν
autos
af-TOSE
saying,
λέγοντες
legō
LAY-goh
Lord,
Κύριε
kyrios
KYOO-ree-ose
wilt
εἰ
ei
ee
at
ἐν
en
ane
τῷ
ho
oh
time
χρόνῳ
chronos
HROH-nose
this
τούτῳ
toutō
TOO-toh
thou restore again
ἀποκαθιστάνεις
apokathistēmi
ah-poh-ka-THEE-stay-mee
the
τὴν
ho
oh
kingdom
βασιλείαν
basileia
va-see-LEE-ah
τῷ
ho
oh
to Israel?
Ἰσραήλ
israēl
ees-ra-ALE
Read Full Chapter :
Acts 1
Cross Reference
మత్తయి సువార్త 17:11
అందుకాయనఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టు నను మాట నిజమే;
యెషయా గ్రంథము 1:26
మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియ మించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.
యెషయా గ్రంథము 9:6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
యిర్మీయా 23:5
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
యిర్మీయా 33:15
ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
యిర్మీయా 33:26
భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతాన మును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.
యెహెజ్కేలు 37:24
నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరి యొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు.
దానియేలు 7:27
ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరి శుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.
హొషేయ 3:4
నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలదినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పిం పకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.
యోవేలు 3:16
యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
ఆమోసు 9:11
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు
ఆదికాండము 49:10
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
మీకా 5:2
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
జెఫన్యా 3:15
తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.
జెకర్యా 9:9
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.
మత్తయి సువార్త 20:21
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
మత్తయి సువార్త 24:3
ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
మార్కు సువార్త 9:12
అందుకాయనఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడ వలెనని వ్రాయబడుట ఏమి?
లూకా సువార్త 17:20
దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయనదేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.
లూకా సువార్త 19:11
వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూష లేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,
లూకా సువార్త 22:29
గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని,
యోహాను సువార్త 21:21
పేతురు అతనిని చూచి ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను.
ఓబద్యా 1:17
అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.