2 Peter 1 - YLT (Telugu)
1 Simeon Peter, a servant and an apostle of Jesus Christ, to those who did obtain a like precious faith with us in the righteousness of our God and Saviour Jesus Christ:యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.
2 Grace to you, and peace be multiplied in the acknowledgement of God and of Jesus our Lord!తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,
3 As all things to us His divine power (the things pertaining unto life and piety) hath given, through the acknowledgement of him who did call us through glory and worthiness,దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.
4 through which to us the most great and precious promises have been given, that through these ye may become partakers of a divine nature, having escaped from the corruption in the world in desires.ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్య ములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను
5 And this same also -- all diligence having brought in besides, superadd in your faith the worthiness, and in the worthiness the knowledge,ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణ మును,సద్గుణమునందు జ్ఞానమును,
6 and in the knowledge the temperance, and in the temperance the endurance, and in the endurance the piety,జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని,
7 and in the piety the brotherly kindness, and in the brotherly kindness the love;భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.
8 for these things being to you and abounding, do make `you' neither inert nor unfruitful in regard to the acknowledging of our Lord Jesus Christ,ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలు లైనను కాకుండ చేయును.
9 for he with whom these things are not present is blind, dim-sighted, having become forgetful of the cleansing of his old sins;ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.
10 wherefore, the rather, brethren, be diligent to make stedfast your calling and choice, for these things doing, ye may never stumble,అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి.మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు.
11 for so, richly shall be superadded to you the entrance into the age-during reign of our Lord and Saviour Jesus Christ.ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.
12 Wherefore, I will not be careless always to remind you concerning these things, though, having known them, and having been established in the present truth,కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.
13 and I think right, so long as I am in this tabernacle, to stir you up in reminding `you',మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి,
14 having known that soon is the laying aside of my tabernacle, even as also our Lord Jesus Christ did shew to me,నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.
15 and I will be diligent that also at every time ye have, after my outgoing, power to make to yourselves the remembrance of these things.నేను మృతిపొందిన తరువాత3 కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
16 For, skilfully devised fables not having followed out, we did make known to you the power and presence of our Lord Jesus Christ, but eye-witnesses having become of his majesty --ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని
17 for having received from God the Father honour and glory, such a voice being borne to him by the excellent glory: `This is My Son -- the beloved, in whom I was well pleased;'ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితివిు.ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా
18 and this voice we -- we did hear, out of heaven borne, being with him in the holy mount.మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.
19 And we have more firm the prophetic word, to which we do well giving heed, as to a lamp shining in a dark place, till day may dawn, and a morning star may arise -- in your hearts;మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.
20 this first knowing, that no prophecy of the Writing doth come of private exposition,ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.
21 for not by will of man did ever prophecy come, but by the Holy Spirit borne on holy men of God spake.ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.
Telugu Bible