2 Kings 2 - WEB (Telugu)
1 It happened, when Yahweh would take up Elijah by a whirlwind into heaven, that Elijah went with Elisha from Gilgal.యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా
2 Elijah said to Elisha, Please wait here, for Yahweh has sent me as far as Bethel. Elisha said, As Yahweh lives, and as your soul lives, I will not leave you. So they went down to Bethel.ఏలీయాయెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషాయెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.
3 The sons of the prophets who were at Bethel came forth to Elisha, and said to him, "Do you know that Yahweh will take away your master from your head today?" He said, "Yes, I know it; hold your peace."బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చినేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడునేనెరుగు దును,మీరు ఊరకుండుడనెను.
4 Elijah said to him, Elisha, please wait here, for Yahweh has sent me to Jericho. He said, As Yahweh lives, and as your soul lives, I will not leave you. So they came to Jericho.పిమ్మట ఏలీయాఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.
5 The sons of the prophets who were at Jericho came near to Elisha, and said to him, "Do you know that Yahweh will take away your master from your head today?" He answered, "Yes, I know it. Hold your peace."యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చినేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగు దువా అని ఎలీషాను అడుగగా అతడునేనెరుగుదును మీరు ఊరకుండుడ నెను.
6 Elijah said to him, "Please wait here, for Yahweh has sent me to the Jordan." He said, "As Yahweh lives, and as your soul lives, I will not leave you." They two went on.అంతట ఏలీయాయెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడుయెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి.
7 Fifty men of the sons of the prophets went, and stood over against them afar off: and they two stood by the Jordan.ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి.
8 Elijah took his mantle, and wrapped it together, and struck the waters, and they were divided here and there, so that they two went over on dry ground.అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడి పోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.
9 It happened, when they had gone over, that Elijah said to Elisha, Ask what I shall do for you, before I am taken from you. Elisha said, please let a double portion of your spirit be on me.వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచినేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషానీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చు నట్లు దయచేయుమనెను.
10 He said, You have asked a hard thing: [nevertheless], if you see me when I am taken from you, it shall be so to you; but if not, it shall not be so.అందుకతడునీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడి నప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.
11 It happened, as they still went on, and talked, that behold, [there appeared] a chariot of fire, and horses of fire, which parted them both apart; and Elijah went up by a whirlwind into heaven.వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను
12 Elisha saw it, and he cried, My father, my father, the chariots of Israel and the horsemen of it! He saw him no more: and he took hold of his own clothes, and tore them in two pieces.ఎలీషా అది చూచినా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కన బడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.
13 He took up also the mantle of Elijah that fell from him, and went back, and stood by the bank of the Jordan.మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి
14 He took the mantle of Elijah that fell from him, and struck the waters, and said, Where is Yahweh, the God of Elijah? and when he also had struck the waters, they were divided here and there; and Elisha went over.ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టిఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.
15 When the sons of the prophets who were at Jericho over against him saw him, they said, The spirit of Elijah does rest on Elisha. They came to meet him, and bowed themselves to the ground before him.యెరికోదగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచిఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి
16 They said to him, See now, there are with your servants fifty strong men; let them go, we pray you, and seek your master, lest the Spirit of Yahweh has taken him up, and cast him on some mountain, or into some valley. He said, You shall not send.అతనితో ఇట్లనిరిఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు;మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసి యుండునేమో అని మనవి చేయగా అతడుఎవరిని పంపవద్దనెను.
17 When they urged him until he was ashamed, he said, Send. They sent therefore fifty men; and they sought three days, but didn't find him.అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.
18 They came back to him, while he stayed at Jericho; and he said to them, "Didn't I tell you, 'Don't go?'"వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగి రాగా అతడువెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను.
19 The men of the city said to Elisha, Behold, we pray you, the situation of this city is pleasant, as my lord sees: but the water is bad, and the land miscarries.అంతట ఆ పట్టణపువారుఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా
20 He said, Bring me a new jar, and put salt therein. They brought it to him.అతడుక్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా
21 He went forth to the spring of the waters, and cast salt therein, and said, Thus says Yahweh, I have healed these waters; there shall not be from there any more death or miscarrying.అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగాఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
22 So the waters were healed to this day, according to the word of Elisha which he spoke.కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.
23 He went up from there to Bethel; and as he was going up by the way, there came forth young lads out of the city, and mocked him, and said to him, Go up, you baldy; go up, you baldhead.అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చిబోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా
24 He looked behind him and saw them, and cursed them in the name of Yahweh. There came forth two she-bears out of the wood, and mauled forty-two lads of them.అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చి వేసెను.
25 He went from there to Mount Carmel, and from there he returned to Samaria.అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను.
Telugu Bible