2 Chronicles 32 - BBE (Telugu)
1 Now after these things and this true-hearted work, Sennacherib, king of Assyria, came into Judah, and put his army in position before the walled towns of Judah, designing to make his way into them by force.రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత... అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొరబడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.
2 And when Hezekiah saw that Sennacherib had come for the purpose of fighting against Jerusalem,సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధము చేయనుద్దేశించి యున్నాడని హిజ్కియాచూచి
3 He took up with his rulers and men of war the question of stopping up the water-springs outside the town; and they gave him their support.పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి,తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి.
4 So they got together a great number of people, and had all the water-springs and the stream flowing through the land stopped up, saying, Why let the kings of Assyria come and have much water?బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుక నేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారు చున్న కాలువను అడ్డిరి.
5 Then he took heart, building up the wall where it was broken down, and making its towers higher, and building another wall outside; and he made strong the Millo in the town of David, and got together a great store of all sorts of instruments of war.మరియు రాజు ధైర్యము తెచ్చు కొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.
6 And he put war chiefs over the people, and sent for them all to come together to him in the wide place at the doorway into the town, and to give them heart he said to them,జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను
7 Be strong and take heart; have no fear, and do not be troubled on account of the king of Assyria and all the great army with him: for there is a greater with us.మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.
8 With him is an arm of flesh; but we have the Lord our God, helping us and fighting for us. And the people put their faith in what Hezekiah, king of Judah, said.మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుట కును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమి్మకయుంచిరి.
9 After this, Sennacherib, king of Assyria, sent his servants to Jerusalem (at that time he was stationed with all his army in front of Lachish), to say to Hezekiah and all the men of Judah in Jerusalem,ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగ మంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను
10 Sennacherib, king of Assyria, says, In what are you placing your hope, waiting here in the walled town of Jerusalem?అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా దేని నమి్మ మీరు ముట్టిడివేయబడియున్న యెరూషలేములో నిలుచు చున్నారు?
11 Is it not Hezekiah who has got you to do it, causing your death from need of food and water, by saying, The Lord our God will give us salvation out of the hands of the king of Assyria?కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపు టకైమన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా?
12 Has not this same Hezekiah taken away his high places and his altars, saying to Judah and Jerusalem, Give worship before one altar only, burning offerings on it?ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసి వేసినవాడుకాడా?
13 Have you no knowledge of what I and my fathers have done to all the peoples of every land? were the gods of the nations of those lands able to keep their land from falling into my hands?నేనును నా పితరులును ఇతరదేశముల జనుల కందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?
14 Who was there among all the gods of those nations, which my fathers put to destruction, who was able to keep his people safe from my hands? and is it possible that your God will keep you safe from my hands?మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆ యా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింప గలిగిన దేవుడొకడైన యుండెనా?
15 So do not be tricked by Hezekiah or let him get you to do this, and do not put any faith in what he says: for no god of any nation or kingdom has been able to keep his people safe from my hands, or the hands of my fathers: how much less will your God keep you safe from my hands!కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి,యే జనుల దేవు డైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.
16 And his servants said even more against the Lord God and against his servant Hezekiah.అతని సేవకులు దేవు డైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.
17 And he sent letters, in addition, to put shame on the Lord, the God of Israel, and to say evil against him, saying, As the gods of the nations of other lands have not been able to keep their people safe from my hands, no more will the God of Hezekiah keep his people safe from my hands.అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింపలేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింప లేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను.
18 These things they said, crying out with a loud voice in the Jews' language, to the people of Jerusalem who were on the wall, with the purpose of troubling them and putting fear into them, so that they might take the town;అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి.
19 Talking of the God of Jerusalem as if he was like the gods of the peoples of the earth, the work of men's hands.మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.
20 And Hezekiah the king, and Isaiah the prophet, the son of Amoz, made prayer because of this, crying out to heaven.రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా
21 And the Lord sent an angel who put to death all the men of war and the chiefs and the captains in the army of the king of Assyria. So he went back to his country in shame. And when he came into the house of his god, his sons, the offspring of his body, put him to death there with the sword.యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవునిగుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.
22 So the Lord gave Hezekiah and the people of Jerusalem salvation from the power of Sennacherib, the king of Assyria, and from all others, giving them rest on every side.ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున
23 And great numbers came to Jerusalem with offerings for the Lord, and things of great price for Hezekiah, king of Judah: so that he was honoured among all nations from that time.అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందు వలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.
24 In those days Hezekiah was ill and near death; and he made prayer to the Lord, and the Lord in answer gave him a sign.ఆ దినములలో హిజ్కియా రోగియై మరణదశలో నుండెను. అతడు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన యొకటి దయచేసెను.
25 But Hezekiah did not do as had been done to him; for his heart was lifted up in pride; and so wrath came on him and on Judah and Jerusalem.అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా
26 But then, Hezekiah, in sorrow for what he had done, put away his pride; and he and all Jerusalem made themselves low, so that the wrath of the Lord did not come on them in Hezekiah's life-time.హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు.
27 And Hezekiah had very great wealth and honour; and he made himself store-houses for his gold and silver and jewels and spices, and for body-covers and all sorts of beautiful vessels.హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగార ములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.
28 And store-houses for the produce of grain and wine and oil; and buildings for all sorts of beasts and flocks.ధాన్యమును ద్రాక్షా రసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.
29 And he made towns for himself, and got together much property in flocks and herds: for God had given him great wealth.మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱలమందలను పసులమందలను అతడు సంపాదించెను.
30 It was Hezekiah who had the higher spring of the water of Gihon stopped, and the water taken down on the west side of the town of David. In everything he undertook, Hezekiah did well.ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.
31 However, in the business of the representatives sent by the rulers of Babylon to get news of the wonder which had taken place in the land, God gave up guiding him, testing him to see what was in his heart.అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటను గూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృద యములోని ఉద్ధేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను.
32 Now the rest of the acts of Hezekiah, and the good he did, are recorded in the vision of Isaiah the prophet, the son of Amoz, and in the book of the kings of Judah and Israel.హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్త యును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథము నందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది.
33 So Hezekiah went to rest with his fathers, and they put his body into the higher part of the resting-places of the sons of David: and all Judah and the people of Jerusalem gave him honour at his death. And Manasseh his son became king in his place.హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియ లను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.
Telugu Bible