Bible

1 Chronicles 4 - BBE (Telugu)

1 The sons of Judah: Perez, Hezron and Carmi and Hur and Shobal.యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.

2 And Reaiah, the son of Shobal, was the father of Jahath; and Jahath was the father of Ahumai and Lahad. These are the families of the Zorathites.శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.

3 And these were the sons of Hur, the father of Etam: Jezreel and Ishma and Idbash, and the name of their sister was Hazzelelponi;అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.

4 And Penuel, the father of Gedor, and Ezer, the father of Hushah. These are the sons of Hur, the oldest son of Ephrathah, the father of Beth-lehem.​మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.

5 And Ashhur, the father of Tekoa, had two wives, Helah and Naarah.​తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.

6 And Naarah had Ahuzzam by him, and Hepher and Temeni and Haahashtari. These were the sons of Naarah.నయరా అతనికి అహుజామును హెపెరును తేమనీని హాయ హష్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమా రులు.

7 And the sons of Helah were Zereth, Izhar and Ethnan.​హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.

8 And Koz was the father of Anub and Zobebah, and the families of Aharhel the son of Harum.​కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.

9 And Jabez was honoured more than his brothers; but his mother had given him the name Jabez, saying, Because I gave birth to him with sorrow.​యబ్బేజు1 తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.

10 And Jabez made a prayer to the God of Israel, saying, If only you would truly give me a blessing, and make wider the limits of my land, and let your hand be with me, and keep me from evil, so that I may not be troubled by it! And God gave him his desire.​యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.

11 And Chelub, the brother of Shuhah, was the father of Mehir, who was the father of Eshton.షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.

12 And Eshton was the father of Bethrapha and Paseah and Tehinnah, the father of Ir-nahash. These are the men of Recah.ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.

13 And the sons of Kenaz: Othniel and Seraiah; and the sons of Othniel: Hathath.కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.

14 And Meonothai was the father of Ophrah; and Seraiah was the father of Joab, the father of Ge-harashim; they were expert workmen.​మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.

15 And the sons of Caleb, the son of Jephunneh: Iru, Elah, and Naam; and the son of Elah: Kenaz.యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.

16 And the sons of Jehallelel: Ziph and Ziphah, Tiria and Asarel.యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు.

17 And the sons of Ezrah: Jether and Mered and Epher and Jalon; and these are the sons of Bithiah, the daughter of Pharaoh, the wife of Mered. And she became the mother of Miriam and Shammai and Ishbah, the father of Eshtemoa.ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.

18 And his wife, a woman of the tribe of Judah, became the mother of Jered, the father of Gedor, and Heber, the father of Soco, and Jekuthiel, the father of Zanoah.అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

19 And the sons of the wife of Hodiah, the sister of Naham, were the father of Keilah the Garmite, and Eshtemoa the Maacathite.మరియు నహము సహోదరియైన హూదీయా భార్యయొక్క కుమారులెవరనగా గర్మీయు డైన కెయీలా మాయకాతీయుడైన ఎష్టెమో.

20 And the sons of Shimon: Amnon and Rinnah, Ben-hanan and Tilon. And the sons of Ishi: Zoheth; and the son of Zoheth. ...షీమోను కుమారులు అమ్నోను రిన్నా బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహేతు బెన్జోహేతు.

21 The sons of Shelah, the son of Judah: Er, the father of Lecah, and Laadah, the father of Mareshah, and the families of those who made delicate linen, of the family of Ashbea;యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును

22 And Jokim, and the men of Cozeba, and Joash and Saraph, who were rulers in Moab, and went back to Beth-lehem. And the records are very old.​యోకీ మీయులకును కోజే బాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూ బిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.

23 These were the potters, and the people living among planted fields with walls round them; they were there to do the king's work.​వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.

24 The sons of Simeon: Nemuel and Jamin, Jarib, Zerah, Shaul;షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.

25 Shallum his son, Mibsam his son, Mishma his son.షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.

26 And the sons of Mishma: Hammuel his son, Zaccur his son, Shimei his son.మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.

27 And Shimei had sixteen sons and six daughters, but his brothers had only a small number of children, and their family was not as fertile as the children of Judah.షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.

28 And they were living at Beer-sheba and Moladah and Hazar-shual,వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను

29 And at Bilhah, and at Ezem, and at Tolad,బిల్హాలోను ఎజెములోను తోలాదులోను బెతూయేలులోను

30 And at Bethuel, and at Hormah, and at Ziklag,హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.

31 And at Beth-marcaboth, and at Hazarsusim, and at Beth-biri, and at Shaaraim. These were their towns till David became king.దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.

32 And their small towns were Etam, Ain, Rimmon, and Tochen and Ashan, five towns;ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.

33 And all the small places round these towns, as far as Baalath-beer, the high place of the South. These were their living-places, and they have lists of their generations.బయలువరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను; ఇవి వారి నివాసస్థలములు, వంశావళి పట్టీలు వారికుండెను.

34 And Meshobab and Jamlech and Joshah, the son of Amaziah,వారు మెషోబాబు యమ్లేకు అమజ్యా కుమారుడైన యోషా,

35 And Joel and Jehu, the son of Joshibiah, the son of Seraiah, the son of Asiel,​యోవేలు అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ.

36 And Elioenai and Jaakobah and Jeshohaiah and Asaiah and Adiel and Jesimiel and Benaiah,ఎల్యోయేనై యహకోబా యెషోహాయా అశాయా అదీయేలు యెశీమీయేలు బెనాయా;

37 And Ziza, the son of Shiphi, the son of Allon, the son of Jedaiah, the son of Shimri, the son of Shemaiah;షెమయాకు పుట్టిన షిమీ కుమారుడైన యెదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు.

38 These, whose names are given, were chiefs in their families, and their families became very great in number.పేళ్లవరుసను వ్రాయబడిన వీరు తమతమ వంశములలో పెద్దలైయుండిరి; వీరి పితరుల యిండ్లు బహుగా వర్ధిల్లెను.

39 And they went to the opening into Gedor, as far as the east side of the valley, in search of grass-land for their flocks.వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి

40 And they came to some good fertile grass-land, in a wide quiet country of peace-loving people; for the people who were living there before were of the offspring of Ham.మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వ మందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపుర ముండిరి.

41 And these whose names are given came in the days of Hezekiah, king of Judah, and made an attack on the Meunim who were living there, and put an end to them to this day, and took their place, because there was grass there for their flocks.పేళ్లవరుసను వ్రాయబడియుండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడినవారి గుడారములను నివాసస్థలములను పడగొట్టి వారిని హతముచేసి, అచ్చట తమ గొఱ్ఱలకు తగిన మేత కలిగియుండుటచేత నేటివరకు వారి స్థానములను ఆక్రమించుకొని యున్నారు.

42 And some of them, five hundred of the sons of Simeon, went to the hill-country of Seir, with Pelatiah and Neariah and Rephaiah and Uzziel, the sons of Ishi, at their head.షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమపైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధి పతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి

43 And they put to death the rest of the Amalekites who had got away safely, and made it their living-place to this day.అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతముచేసి నేటివరకు అచ్చట కాపురమున్నారు.

Telugu Bible